సెప్టెంబర్‌లోగా తెలంగాణ రావడం ఖాయం:కేకే

హైదరాబాద్‌: సెప్టెంబర్‌లోగా తెలంగాణ రావడం ఖాయమని  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ కే కేశవరావు చెప్పారు. ఈరోజు ఆయన గాంధీ భవన్‌ ముందు వీ హనుమంతరావు చేపట్టిన మౌనదీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు దీక్ష స్థలని వచ్చారు. తర్వాత విలేకరులతో మాట్లాడారు. కేంద్ర హోంశాఖ నివేదికను పట్టించుకోవాల్సిన అవసరంలేదని, కేంద్రం తీసుకునే రాజకీయ నిర్ణయమే చిట్టచివరిదని ఆయన స్పష్టం చేశారు.