సైనా కల ఇప్పటికి నెరవేరింది

హైదరాబాద్‌: లండన్‌ ఒలింపిక్స్‌లో హైదరాబాద్‌ స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ కాంస్యపతకం సాధించడంపై ఆమె తండ్రి హర్‌వీర్‌సింగ్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించాలన్న సైనా కల ఇప్పటికి నెరవేరిందని ఆయన అన్నారు. కాంస్యం కోసం జరిగిన పోరులో ప్రత్యర్థి వాంగ్‌జిన్‌ గాయపడటంతో అనూహ్యంగా వాకోవర్‌లభించి సైనా విజేతగా నిలిచింది.