సైన్స్ ల్యాబ్ ద్వారా విజ్ఞాన శాస్త్రం విషయాలు సులభంగా అర్థం చేసుకోవచ్చు.
జిల్లా విద్యాధికారి ధనాలకోట రాధా కిషన్
రాజన్న సిరిసిల్లబ్యూరో. సెప్టెంబర్ 23. (జనం సాక్షి). సైన్స్ ల్యాబ్ ద్వారా విజ్ఞాన శాస్త్ర విషయాలను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవచ్చని జిల్లా విద్యాధికారి ధనాలకోట రాధా కిషన్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అగస్త్య ఫౌండేషన్ సైన్స్ ల్యాబ్ ను జిల్లా విద్యాధికారి ధనాలకోట రాధాకిషన్ ప్రారంభించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు చకినాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాధా కిషన్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యేక చొరవతో జిల్లాకు మొబైల్ సైన్స్ ల్యాబ్ కింద ఒక వ్యాను ముగ్గురు ట్యూటర్స్ బైక్ అందుబాటులోకి వచ్చాయని అన్నారు. అగస్త్య ఫౌండేషన్ సంస్థ మొబైల్ సెన్స్ ల్యాబ్ ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రయోగ పరికరాలతో సైన్స్ విషయాలపై ప్రయోగ పద్ధతిలో బోధించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు సైన్స్ విషయాల పట్ల పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో వంతడుపుల ఆంజనేయులు, అగస్త్య ఫౌండేషన్ ట్యూటర్స్ ప్రశాంత్ కుమార్, నందిని, వినయ్ ,రాజు పాఠశాల ఉపాధ్యాయులు రవీందర్, వనజ, చిన్నమనేని రాజు, తిరుపతి, రాజగోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు