జీహెచ్‌ఎంసీ పరిధి మరింత విస్తరణ
` 27 మున్సిపాలిటీల విలీనం
` ఓఆర్‌ఆర్ లోపలా, బయట ఉన్నవి విలీనం
` కొత్తగా మరో విద్యుత్ డిస్కమ్ ఏర్పాటుకు నిర్ణయం
` ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం
` హైదరాబాద్‌ను 3 సర్కిళ్లుగా విభజించి భూగర్భ కేబుల్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు
` పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ విభాగంలో పెట్టుబడులకు ఆహ్వానం
` జూబ్లీహిల్స్‌తోపాటు రాష్ట్రంలో మరికొన్ని అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల ఏర్పాటు
` తెలంగాణ కేబినేట్ పలు కీలక నిర్ణయాలు
హైదరాబాద్(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీని విస్తరించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్నా 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం సుమారు 4 గంటలకుపైగా వివిధ అంశాలపై చర్చించింది. రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలను డిప్యూటి సిఎం,మంత్రి శ్రీధర్‌బాబు,జూపల్లి కృష్ణారావులు విూడియాకు వెల్లడిరచారు. హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల, బయట, ఓఆర్‌ఆర్‌ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ (మున్సిపాలిటీ, కార్పొరేషన్లను) జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పెద్ద అంబర్‌పేట్, జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, తుక్కుగూడ, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అవిూన్‌పూర్, బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, విూర్‌పేట, బోడుప్పల్, నిజాంపేట్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్ మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో హైదరాబాద్ పరిధి మరింత పెరుగుతందన్నారు. అంతేకాకుండా మరో విద్యుత్ డిస్కమ్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రులు తెలిపారు. కొత్త డిస్కమ్ పరిధిలోకి లిప్ట్ ఇరిగేషన్ కనెక్షన్లు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, వ్యవసాయ కనెక్షన్లు, మిషన్ భగీరథ కనెక్షన్లు వస్తాయన్నారు. వచ్చే పదేళ్లలో విద్యుత్ డిమాండ్‌కు అవసరమైన ఏర్పాట్లపై చర్చినట్లు వివరించారు. ఈ క్రమంలోనే 3వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలు చేయాలని, ఈ మేరకు త్వరలోనే టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ క్రమంలో 2 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ కొనుగోలుకు కేబినేట్ ఆమోదించింది. పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ విభాగంలో పెట్టుబడుల ఆహ్వానించాలన ఇనిర్ణయించారు. రాష్ట్రంలో పలు చోట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాలున్నాయి. పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్లను నెలకొల్పేందుకు ముందుకొచ్చే కంపెనీలు, పెట్టుబడిదారులకు అనుమతి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే డిస్కమ్‌ల వద్ద ఉన్న ఎంవోయూలను కూడా పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి ప్రదర్శించే కంపెనీలకు ప్రభుత్వమే అవసరమైన భూమిని కేటాయించి, నీళ్లను అందిస్తుంది. ఈ ప్లాంట్లలో ఉత్పత్తి చేసే విద్యుత్‌ను ముందుగా మన డిస్కమ్‌లకే అమ్మాలనే షరతుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది.కొత్త పరిశ్రమలకు సొంతగా విద్యుత్ తయారీ చేసుకునేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం కోసం కేబినేట్ ఆమోదించింది. పాల్వంచ, మక్తల్‌లోనూ ప్లాంట్ల నిర్మాణ అవకాశాలపై పరిశీలన చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌ను 3 సర్కిళ్లుగా విభజించి భూగర్భ కేబుల్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయించారు. భూగర్భ విద్యుత్ వ్యవస్థతోపాటు టీ ఫైబర్ కేబుళ్ల ఏర్పాటు చేయనున్నారు. భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్దనల్లవెల్లిలో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటుకు 20 ఎకరాల స్థలం కేటాయింపునకు ఆమోదించారు. అలాగే ములుగు జిల్లా జగ్గన్నపేటలో స్పోర్ట్స్ స్కూల్‌కు 40 ఎకరాలు కేటాయింపు ఇవ్వనున్నారు. జూబ్లీహిల్స్‌తోపాటు రాష్ట్రంలో మరికొన్ని అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల ఏర్పాటుకు నిర్ణయించారు.
క్యాబినెట్ మరిన్ని నిర్ణయాలు
2 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ కొనుగోలు
పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ విభాగంలో పెట్టుబడుల ఆహ్వానం
కొత్త పరిశ్రమలకు సొంతగా విద్యుత్ తయారీ చేసుకునేందుకు అనుమతి
ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం
పాల్వంచ, మక్తల్‌లోనూ ప్లాంట్ల నిర్మాణ అవకాశాలపై పరిశీలన
హైదరాబాద్‌ను 3 సర్కిళ్లుగా విభజించి భూగర్భ కేబుల్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు
భూగర్భ విద్యుత్ వ్యవస్థతోపాటు టీఫైబర్ కేబుళ్ల ఏర్పాటు
భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్దనల్లవెల్లిలో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటుకు 20 ఎకరాల స్థలం కేటాయింపు
ములుగు జిల్లా జగ్గన్నపేటలో స్పోర్ట్స్ స్కూల్‌కు 40 ఎకరాలు కేటాయింపు
జూబ్లీహిల్స్‌తోపాటు రాష్ట్రంలో మరికొన్ని అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల ఏర్పాటు



