మోగిన పంచాయతీనగరా
` తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యుల్ విడుదల
` మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణ
` డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్
` అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
` రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడి
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకునోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎలన్నికల కమిషన్ విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం నిర్వహించిన విూడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఈ మేరకు వివరాలు వెల్లడిరచారు. మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ నేటి నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 29న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాం. కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 9న షెడ్యూల్‌పై స్టే విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ ఓటర్లు 1.66 కోట్ల మంది ఉన్నారు. 4,200 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు తొలి దశలో ఎన్నికలు నిర్వహిస్తాం అని ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. గురువారం నుంచి తొలి విడత పోలింగ్‌కు సంబంధించిన నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండో విడత ఎన్నికలకు ఈ నెల 30 నుంచి, మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డులకు పోలింగ్ జరగనుండగా.. మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలు, 36,452 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు.
పంచాయతీ ఎన్నికల ముఖ్య తేదీలు
12,728 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు
1,12,242 వార్డు స్థానాలకు ఎన్నికలు
డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్
ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్
పోలింగ్ రోజే మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు
ఎల్లుండి నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ


