సోదరుల్లా విడిపోదాం..

ఆటా మహాసభల్లో మధు యాష్కీ
ప్రత్యేక ఆకర్షణగా అజారుద్దీన్‌
అట్లాంటా : సీమాంధ్ర, తెలంగాణ ప్రజలందరం సోదరుల్లా, సుహృద్భావ వాతావరణంలో విడిపోదామని నిజామా బాద్‌ ఎంపీ మధు యాష్కీ అభిలాషిం చారు. శనివారం అమెరికాలోని అట్లాం టాలో జరిగిన అమెరికా తెలుగు సంఘం (ఆటా) 12వ మహాసభలకు ఆయన ముఖ్య అతిథుల్లో ఒకరిగా హాజరై మాట్లాడారు. ప్రతి చిన్న విషయంలో రెండు ప్రాంతాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం కంటే విడిపో వడమే మేలని ఆయన అభిప్రాయ పడ్డారు. తెలంగాణ ఏర్పాటును కొందరు స్వార్థ రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం అడ్డుకుంటున్నారని, ఇకనైనా వాళ్లు తమ కోసం కాకుండా ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రెండు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అట్టహాసంగా జరిగిన ఆటా మహాసభలోమరో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు డి.కె.అరుణ, శ్రీధర్‌బాబు, కేంద్ర మంత్రి పళ్లం రాజు, లక్ష్మీ పార్వతి తదితరులు పాల్గొన్నారు. వరల్డ్‌ కాంగ్రెస్‌ సెంటర్‌లో జరిగిన సభలను డి.కె.అరుణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇదిలా ఉండగా, సభలకు ఎంతో మహామహులు వచ్చినా భారత క్రికెట్‌ టీం మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.