సౌత్‌ జోన్‌ బాస్కెట్‌ బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు

హైదరాబాద్‌: నగరంలోని యూసుఫ్‌గూడలో ఉన్న కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం వేదికగా ఈ నెల 5 నుంచి 9 వరకూ సౌత్‌ జోన్‌ బాస్కెట్‌ బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు జరగనున్నాయి. జాతీయ బాస్యెట్‌బాల్‌ సంఘంతో పాటు రాష్ట్ర బాస్కెట్‌బాల్‌ సంఘం సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి. పురుషుల, మహిళల విభాగాల్లో దాదాపు 200కు పైగా క్రీడాకురులు పాల్గొంటున్నాయి. టోర్నీ జరిగే రోజుల్లో మ్యాచ్‌లను వీక్షించేందుకు నిర్వాహకులు అందరినీ ఆహ్వానిస్తున్నారు.