స్కాట్‌లాండ్‌లో గుంటూరు జిల్లా వాసి కాల్చివేత

గుంటూరు: ఉన్నత చదువులు అమెరికాలో పూర్తి చేసి స్కాట్‌లాండ్‌లో చిరుద్యోగిగా పనిచేస్తున్న మలినేని దిలీప్‌(27) అనే యువకుడు ప్రేమ వివాదంలో తుపాకీ కాల్పులకు గురై మృతి చెందాడు. ఈ సంఘటన ఈ నెల 5న స్కాట్‌లాండ్‌లో జరిగింది. దిలీప్‌ తల్లిదండ్రుల స్వగ్రామం గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం లింగారావు పాలెంలో నివసిస్తున్నారు. వారికి సమాచారం ఆలస్యంగా అందింది. సమీప బంధువులు వివరాలు తెలిపారు. స్కాట్‌లాండ్‌లోనే నివసిస్తున్న యువతిని దిలీప్‌ కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. ఇరువైపుల పెద్దలను ఒప్పించాలని యత్నించాడు. రెండు కుటుంబాలు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 5న ప్రేమించిన యువతి సోదరుడు దిలిప్‌ను తుపాకీతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరీక్షలు నిర్వహించారు. మృతదేహం నుంచి తుపాకీ తూటాలను బయటకు తీశారు. కేసు నమోదు చేశారు.