స్థానిక యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే నా ధ్యేయం: టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి

 సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి:శామీర్ పేట్, జనం సాక్షి :
తూంకుంట మున్సిపల్ పరిధిలోని దేవరయంజాల్ గ్రామంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో
హాథ్ సే హాథ్ జోడోయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి,మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి
గ్రామంలో భగత్ సింగ్,ఇందిరా గాంధీ,రాజీవ్ గాంధీ,వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి జోడోయాత్ర ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ నాయకులు గడప గడపకు తిరిగారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టబోయే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి,ప్రస్తుతం ఉన్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దగా చేస్తున్నాయని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని తూంకుంట మున్సిపాలిటీలో ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు,రైతులకు లక్ష రుణమాఫీ ఇస్తామని చెప్పారు. ఇంతవరకు పట్టించుకోవడం లేదు,ఇంటికో ఉద్యోగం అన్నారు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు,నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు దాని ఊసే లేదు,స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇస్తామని చెప్పినారు ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు.మహిళలకు వడ్డీ లేని రుణాలు సమయానికి ఇవ్వడం లేదు,కేజీ టు పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అందిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని,ఇండ్లు లేని అర్హులైన వారందరికీ ఐదు లక్షలతో ఇండ్లు నిర్మించి ఇస్తుంది అన్నారు,ఐదు వందల కి గ్యాస్ సిలిండర్ అందిస్తుందని తెలిపారు,రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఐదు లక్షలతో కార్పొరేట్ హాస్పిటల్లలో వైద్యం అందించేలా కృషి చేస్తుందన్నారు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తుందని తెలిపారు,అదేవిధంగా నిరుద్యోగ యువకులకు రెండు లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ చైర్మన్ షఫీ యుద్దీన్ ,మేడ్చల్ జిల్లా ఐ ఎన్ టి యూ సి అధ్యక్షులు శేఖర్ ,తూంకుంట మున్సిపాలిటీ 4 వ వార్డ్ కౌన్సిలర్ మధుసూదన్ రెడ్డి ,మాజీ ఉపసర్పంచ్ శంకర్ గౌడ్ ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి ,జనార్దన్ రెడ్డి ,నారాయణ ,తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మురళి గౌడ్ ,యాదగిరి ,రాము ,ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ ,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ(నాని),మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు హరి గోపాల్ ,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు ధర్మారెడ్డి ,మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జగదీష్ గౌడ్,మేడ్చల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శశాంత్ (బన్నీ),జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనంతలక్ష్మి ,మేడ్చల్,షామీర్పేట్ మండలాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ ,నవీన్ రెడ్డి ,మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మధు ,హకీంపేట్ 9 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్,తదితరులు పాల్గొన్నారు.