స్థానిక సమస్యలపై నగరపాలక కార్యలయం ముందు టీడీపీ ధర్నా

కరీంనగర్‌: జిల్లా నగరపాలకు సంస్థ కార్యలయాన్ని ఈ రోజు టీడీపీ నాయకులు ముట్టడించారు. నగరంలోని రోడ్లు మురికి కాలువలు, సెంట్రల్‌ డ్రైనేజి సిస్టం నిర్మాణ క్రమంలో చెడిపోయినాయని నగర ప్రజలు రోడ్ల నిర్మాణానికి 30శాతం   సహకారంతో నిర్మించుకున్న రోడ్లు డ్రైనేజి సిస్టం తవ్వకాలల్లో గుంతలుగా ఏర్పడి ద్విచక్ర వాహనా చోదకులకు ప్రాణ సంకటంగా మారిందని వాహనాలు చెడిపోతున్నాయని మురుగునీరు వాన నీరు గుంతల్లో నిలిచిపోయి వాహనాల రాకపోకలకు, రోడ్డుపై కాలినడకన వెళ్లె వారికి ఇబ్బంది కలుగుతుందని వెంటనే నగరపాలకసంస్థ ఇంచార్జ్‌ జిల్లా కలెక్టర్‌ 50డివిజన్లలో ప్రత్యేక అధికారలను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని నగరపాలక కార్యలయం ముందు టీడీపీ ధర్నా నిర్వహించారు.