స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం
టీడీపీ సభ్యులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మంత్రి నాయిని నర్సింహా రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ పై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. అటు అసెంబ్లీలో హుందాగా వ్యవహరించాల్సిన అవసరముందని మంత్రి ఈటెల హితవు పలికారు. జాతీయగీతాన్ని అవమానపర్చినందుకే టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారని స్పష్టం చేశారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రతిపక్షాలు చేసిన సూచనపై అన్ని విధాలుగా పరిశీలించి, అందరి అభిప్రాయాలు తెలుసున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తెలిపారు.