హక్కులను అమ్ముకున్న ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ

కాకతీయఖని, జూన్‌ 16, (జనంసాక్షి) :

సింగరేణి కార్మికులు గుర్తింపు సంఘాలుగా ఐఎన్‌ టీయూసీ, ఏఐటీయూసీిలను నమ్ముకుంటే ఎంతో కాలంగా సాధించుకున్న హక్కులను యాజమాన్యా నికి అమ్ముకున్నారని టీబీజీకేఎస్‌ బ్రాంచి ఉపాధ్య క్షుడు అప్పాని శ్రీనివాస్‌ ఆరోపించారు. శుక్రవా రం స్థానిక కెేటీకే 2వ గని ఆవరణలో జరిగిన గేట్‌ మీటింగ్‌కు బందెల చందర్‌రావు అధ్యక్షత వహిం చగా ముఖ్యఅతిథిగా హాజరైన అప్పాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ రానున్న గుర్తింపు సంఘ ఎన్నికల్లో కార్మికుల సమస్యలను గాలికి వదిలేసిన సంఘా లైన ఏఐటీయూసీి, ఐఎన్‌టీయూసీిలు ప్రచార నిమి త్తం వచ్చి వారు చెప్పే మోసపూరిత మాటలను న మ్మవద్దని అన్నారు.   సింగరేణిలో మూడు దఫాలు గా ఏఐటీయూసీి, ఒక్క దఫా ఐఎన్‌టీయూసీ గు ర్తింపు సంఘంగా ఉన్నాయని అన్నారు. వీరి కా లంలో ఎలాంటి సమస్యలు పరిష్కరించకపోగా అ నేక హక్కులను కార్మికులు నష్టపోవల్సి వచ్చింద న్నారు. ఈ సంఘాలు యాజమాన్యం వద్ద కార్మి కులు సాధించుకున్న హక్కులను తాకట్టు పెట్టి కా ర్మిక వర్గం పై నిర్బంద పనిబారం మోపినట్లు చె ప్పారు. కార్మికుల ఆత్మగౌరవాన్ని కించపరిచే వి ధంగా యాజమాన్యం వద్ద బానిసలుగా మార్చార ని ఆరోపించారు. ఇన్ని సంవత్సరాలు గుర్తింపు సంఘంగా ఉన్న ఈ సంఘాలు ఏ ఒక్క రోజు కూ డా కార్మికుల పక్షాన పోరాడింది లేదని విమర్శిం చారు. ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి, నీతికి అవినీతికి, తెలంగాణవాదానికి, సమైఖ్యాంధ్ర విధా నానికి వ్యతిరేకంగా ఎన్నికలు జరుగుతున్నట్లు చె ప్పారు. టీబీజీకేఎస్‌ పుట్టిందే తెలంగాణ ఏర్పాటు కోసమని ఇందుకోసం పోరు చేయడమే తమవం తు బాధ్యతగా పేర్కొన్నారు. ఈ సారి ఎన్నికల్లో కూడా మరోసారి కార్మికులను మోసం చేయాలని చూస్తున్నారని ఎస్‌డిఎల్‌ ఆపరేటర్సు క్వార్టర్లు, లైట్‌ జాబ్‌లు, మెడికల్‌ ఆన్‌ఫిట్‌లు చేయిస్తామని జనరల్‌ షిప్టులు ఇప్పిస్తామని, కార్మికులకు సర్ఫేస ్‌లో పనులు ఇప్పిస్తామని చెప్పి నమ్మబలికే ప్రయ త్నం చేస్తున్నారని కార్మికులు దీనిని గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ గెలిస్తే త ెలంగాణ ఆత్మగౌరవం కోసం ఉద్యమిస్తామని, సిం గరేణి పరిరక్షణ కోసం పాటుపడతామని వారు చె ప్పారు. తెలంగాణ గడ్డ విముక్తి కోసం పోరాడుతు న్న టీబీజీకేఎస్‌ను ఆదరించాలని వారు కార్మికుల ను కోరారు. ఈ సమావేశంలో మండ సంపత్‌, న ర్సింగరావు, రేణికుంట్ల మల్లేష్‌, లక్ష్మణ్‌, మనోజ్‌కు మార్‌, యాదగిరి, ఈర్ల సదానందం, వెంకటస్వా మి, వేణు, కోరం లక్ష్మణ్‌, స్వామి, అజ్మియా, జనా ర్ధన్‌, మధు తదితరులు పాల్గొన్నారు.