హక్కుల పరిరక్షణ చట్టాల అమలు పై కేంద్రమంత్రి సమీక్ష

హైదరాబాద్‌:రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ చట్టాల అమలు పై ఏర్పాటైన పార్లమొంటరీ స్థాయి కమిటీ ఇవాళ హైదరాబాదులో సమీక్ష నిర్వహిస్తోంది.కమిటీ ఛైర్మన్‌ కేంద్రమంత్రి ముకుల్‌ వాస్నిక్‌ సహ కమిటీలోని ఎంపీలు,రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి,ఇతర మంత్రివర్గ సహచరులు,ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హజరయ్యారు.రాష్ట్రంలో ఈ చట్టాల అమలు తీరును,వాటి ఉల్లంఘనలకు పాల్పడినవారిపై చర్యలు,నమోదైన కేసులు నిందితులపై చర్యలు వంటి అంశాలను ఇందులో ప్రధానంగా చర్చిస్తున్నారు.మరోవైపు సామాజిక న్యాయం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం బాదితులకు అందిస్తున్న సాయాన్ని దాన్ని మెరుడుపర్చేందుకు చర్యలను కూడా ఇందులో సమీక్షించనున్నారు.