హత్యాయత్నం కేసులో జైలుకళ్లిన అసలు దోషి బదులు, మరో వ్యక్తి

కర్నూలు: హత్యాయత్నం కేసులో 2004లో ఉరుకుందు అనే వ్యక్తికి కోర్టు శిక్ష విధించింది. అయితే ఉరుకుందుకు బదులుగా రంగస్వామి అనే వ్యక్తి జైలుకెళ్లాడు. జైలులో ఉండాల్సిన ఉరుకుందును చిలకల డోనులో ఫిర్యాదు దారు హనుమంతు గుర్తించడంతో విషయం బయటపడింది. ఈ వ్యవహారంపై హనుమంతు కోర్టుకెళ్లాడు. ఉరుకుందును హాజరుపర్చాలని ఆదోని కోర్టు పోలీసులను ఆదేశించింది.