హత్యాయత్నం నిందితుల అరెస్ట్ రిమాండ్ కు తరలింపు: తిమ్మాపూర్ సీఐ శశిధర్ రెడ్డి – ఎస్సై డి.సుధాకర్.

జనంసాక్షి/ చిగురుమామిడి – సెప్టెంబర్23:
చిగురుమామిడి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో 21వ తారీకు అనగా బుధవారం రోజు సాయంత్రం జరిగిన హత్యా ప్రయత్నం కేసులో నిందితులైన గడ్డం వెంకటరమణ, బుట్టి ప్రేమ్ కుమార్ లను అరెస్ట్ చేసినట్లు తిమ్మాపూర్ సీఐ శశిధర్ రెడ్డి, ఎస్సై డి.సుధాకర్ శుక్రవారం తెలిపారు.వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రానికి చెందిన గడ్డం స్వప్న,గడ్డం చందుపైన ప్రేమ్ కుమార్, వెంకటరమణ కత్తులతో దాడి చేసి హత్యా ప్రయత్నం చేసి పారిపోయినారని గడ్డం చందు తండ్రి గడ్డం శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సుధాకర్ కేసు నమోదు చేయగా దర్యాప్తులో భాగంగా పరారీలో ఉన్న నేరస్తులను పట్టుకునే క్రమంలో నమ్మదగిన సమాచారం మేరకు నిన్న గురువారం సాయంత్రం ఐదు గంటలకు తిమ్మాపూర్ సిఐ శశిధర్ రెడ్డి అలుగునూర్ లోని కాకతీయ కెనాల్ వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం నేరస్తుల యొక్క నేరం ఒప్పుకోగా పంచనామ నిర్వహించి నేరస్తుల వద్ద నుండి TS02EB5872 నెంబర్ గల హోండా డ్రీమ్ యుగ మోటార్ సైకిల్ ని వారి వద్ద ఉన్న రక్తపు మరకల దుస్తులను, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని నేరస్తులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. 2020 సెప్టెంబర్ నెలలో నేరస్తుడు అయిన గడ్డం వెంకటరమణ యొక్క చెల్లెలు నందిత వివాహము తన మేనబావ అయిన మరో నేరస్తుడు బుట్టి ప్రేమ్ కుమార్ తో జరిగింది. అయితే వివాహానికి ముందే గడ్డం నందితతో వరుసకు అన్న అయ్యే గడ్డం చందు తో ప్రేమ సంబంధం ఉండడంతో భార్యాభర్తల మధ్య తరుచు గొడవలు కాగా మూడు నెలల కింద విడాకులు తీసుకున్నారు. అనంతరం గడ్డం చందు నందిత అనే అమ్మాయిని హైదరాబాదులో పెళ్లి చేసుకుని అక్కడే ఉన్నారు. ఆతర్వాత నందిత కుటుంబ సభ్యులు గడ్డం చందు కుటుంబ సభ్యులు ఇద్దరిని పిలిపించి కౌన్సిలింగ్ చేసినప్పటికీ నందిత చందుతోనే వెళ్తాననడం చందు నందితకు వరసకు అన్నయ్య అవడంతో జీర్ణించుకోలేని నందిత సోదరుడు వెంకటరమణ, మాజీ భర్త ప్రేమ్ కుమార్ ఇద్దరు కలిసి నిందితుడిని చంపాలనే ఉద్దేశంతో చిగురుమామిడి తన ఇంటికి బైక్ పైన వచ్చి కత్తితో దాడి చేసినారు. అడ్డు వచ్చిన చందు తల్లి స్వప్న పైన కూడా హత్యా ప్రయత్నం చేయగా బాధితుల అరుపులు విని కాలనీ వాసులు దగ్గరికి రావడంతో నేరస్తులు బైక్ పైన పారిపోయినరు. తర్వాత అక్కడి నుండి బైక్ పైన జగిత్యాలకు వెళ్లి నిన్న అనగా 22.09.2022 గురువారం రోజున హైదరాబాద్ పారిపోదమని బైక్ పైన ఇద్దరు నేరస్తులు వెళ్తుండగా సాయంత్రం అల్గునూర్ వద్ద సిఐ శశిధర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి పట్టుకున్న అనంతరం నేరస్తులను రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు.