హర్యానా ప్రభుత్వం, డీఎల్‌ఎఫ్‌ కుమ్మ్కయ్యాయి:కేజ్రీవాల్‌

ఢిల్లీ: హర్యానా ప్రభుత్వం, డీఎల్‌ఎఫ్‌ సంస్థలు కుమ్మక్కయ్యాయని అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. రాబార్ట్‌ వాద్రా అవినీతికి పాల్పడ్డారని రుజువు చేసే మరికొన్ని పత్రాలను ఈ రోజు సాయంత్రం కేజ్రీవాల్‌ బయటపెట్టారు. హర్యానా ప్రభుత్వం డీఎల్‌ఎఫ్‌ మధ్య సంబంధాన్ని హైకోర్టు కూడా గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. వాద్రా ఆస్తుల గురించి తనకు చాలమంది ఆధారాలు పంపించారన్నారు. ఆస్పత్రి స్థలాన్ని హర్యానా ప్రభుత్వం డీఎల్‌ఎఫ్‌కు కేటాయించిందని ఆరోపించారు.