హాకీ అసలుసిలసు హీరో నవీన్‌ పట్నాయక్‌


హాకీకి ఊతంగా నిలిచిన ఒడిషా సిఎం
కార్పోరేట్‌ కంపెనీల ఛీత్కారంతో వందకోట్ల ప్రోత్సాం
హాకీ విజయాలకు స్ఫూర్తిని ఇచ్చిన నవీన్‌
ప్రోత్సహించడంతో టోక్యోలో నిలిచిన ఆశలు
న్యూఢల్లీి,ఆగస్ట్‌7(జనంసాక్షి): ఐదేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌లో నిరాశపరిచిన భారత హాకీ బృందం టోక్యోలో సత్తా చాటేందుకు నాలుగేళ్లు తీవ్రంగా శ్రమించింది. పలు టోర్నమెంట్లలో విజేతగా నిలిచి మూడో స్థానంతో ప్రపంచ ర్యాంకును మెరుగుపరచుకొని టోక్యోలో అడుగుపెట్టింది. గ్రూప్‌ దశలో తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్‌ను ఓడిరచి శుభారంభం చేసిన భారత్‌, రెండో మ్యాచ్‌లో ఆస్టేల్రియా చేతిలో దారుణ
పరాజయాన్ని చవిచూసింది. అయినా నిబ్బరం కోల్పోకుండా స్పెయిన్‌, అర్జెంటీనా, జపాన్‌పై వరుస విజయాలతో క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. అదే జోరులో గ్రేట్‌ బ్రిటన్‌పై గెలుపుతో సెవిూస్‌ చేరి స్వర్ణపతకంపై ఆశలు రేపింది. కానీ, ఫైనల్‌ చేరడంలో విఫలమవుతూ ప్రపంచ రెండో ర్యాంకర్‌ బెల్జియం చేతిలో ఓటమి చవిచూసింది. దీంతో, భారత జట్టు కసితో రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత జర్మనీపై అద్భుతంగా పోరాడి ఫలితాన్ని రాబట్టింది. హోరాహోరీ మ్యాచ్‌లో జట్టులోని కుర్రాళ్లు చిరస్మరణీయ పోరాటాన్ని ప్రదర్శించి పతకాన్ని సాధించారు. మూడోసారి ఒలింపిక్స్‌ ఆడిన మన్‌ప్రీత్‌ సింగ్‌లాంటి అనువజ్ఞుడు జట్టును నడిపించడం, గోల్‌కీపర్‌ శ్రీజేష్‌లాంటి సీనియర్‌ ఆటగాడి సలహాలను జూనియర్లు పాటించడం, ఆస్టేల్రియాకు చెందిన విదేశీ కోచ్‌ గ్రహం రీడ్‌ శిక్షణలో యూరోపియన్‌ శైలిని అలవాటు చేసుకోవడం వంటి అనేకానేక అంశాలు భారత్‌ విజయానికి దోహదం చేశాయి. ఈ గెలుపులో మరో ప్రధాన పాత్రధారి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌. కాసులు కురిపించే క్రికెట్‌ను స్పాన్సర్‌ చేయడం తప్ప, మూడేళ్ల క్రితం వరకూ మన దేశంలో హాకీని ప్రమోట్‌ చేసేందుకు ఎవరూ ముందుకు రాని స్థితి. హాకీ కథాంశంగా నిర్మించిన ’చక్‌ దే ఇండియా’ సినిమాలో కథానాయకుడిగా మెప్పించిన షారుక్‌ ఖాన్‌ కూడా ఐపీఎల్‌లో పెట్టుబడులు పెట్టి క్రికెట్‌లో తన వ్యాపారాన్ని విస్తరించుకున్నారు. ఇలాంటిస్థితిలో నవీన్‌ పట్నాయక్‌ ముందుండి పురుషులు, మహిళల హాకీ జట్టుకు ఒడిశా సర్కారు రూపంలో ప్రధాన స్పాన్సరర్‌ అయ్యారు. గతంలో హాకీ క్రీడాకారుడైన ఆయన ఇరుజట్లతో ఐదేళ్లకుగాను వంద కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని జాతీయ క్రీడకు అండగా నిలిచారు. తన ప్రోత్సాహంతో ముందుకెళ్లిన ఆటగాళ్లు ఇప్పుడు ఒలింపిక్‌ పతకంతో తిరిగివస్తుండడంతో పట్నాయక్‌ ఆనందానికి అవధుల్లేవు. మహిళల హాకీ జట్టు కూడా టోక్యోలో అద్భుత ప్రదర్శన చూపుతున్నది. కాంస్య పతక పోరులో అమ్మాయిలు కూడా విజయం సాధిస్తే భారత్‌ ఆనందానికి అవధులుండవు. మన క్రీడారంగాన్ని క్రికెట్‌ శాసిస్తున్న ఈ రోజుల్లో ఒలింపిక్‌ విజయం ఈ జాతీయ క్రీడలో తిరిగి జవసత్వాలు నింపుతుందని ఆశిద్దాం. టోక్యో ఒలంపిక్స్‌ లో భారత్‌ మెన్స్‌ హాకీ జట్టు అద్భుతమైన ప్రతిభతో.. 41 ఏళ్ల తర్వాత ఒలంపిక్స్‌ లో మెడల్‌ సాధించింది. తెర వెనక హాకీ జట్టుకు సపోర్ట్‌ చేసింది.. ప్రోత్సహించిన వ్యక్తి ఒకరు ఉన్నారు.. ఆయనే ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌. దేశం మొత్తం పట్టించుకోని వేళ ఆయన ఇచ్చిన 100 కోట్లే ఈ రోజు హాకీ జట్టు విజయానికి కారణం అయ్యాయి. భారత హాకీ జట్టు పేవలమైన ప్రదర్శన కారణంగా అప్పటి వరకు స్పాన్సర్‌ షిప్‌గా ఉన్న సహారా కంపెనీ తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. 2018 సంవత్సరంతో పురుషుల, మహిళల జట్టుతో ఉన్న అన్ని కాంట్రాక్టులను రద్దు చేసుకుంది సహారా కంపెనీ.ఇదే సమయంలో స్పాన్సర్‌ షిప్‌ కోసం భారత హాకీ ఫెడరేషన్‌ ఎన్నో కార్పొరేట్‌ కంపెనీలను అప్రోచ్‌ అయ్యింది. ఎవరూ ముందుకు రాలేదు. ఇవన్నీ అటు ఉంచితే హాకీ మ్యాచ్‌ లు చూసేది ఎవరు అంటూ ఎగతాళి చేశాయి కార్పొరేట్‌ కంపెనీలు. సరిగ్గా ఇక్కడే ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఎంటర్‌ అయ్యారు. హాకీ జట్లకు ఒడిశా ప్రభుత్వం తరపున 100 కోట్ల రూపాయలతో కాంట్రాక్టు కుర్చుకున్నారు. 2023 వరకు ఒడిశా ప్రభుత్వం భారత హాకీ జట్లకు స్పాన్సర్‌ గా ఉంది.దీనికి కారణం కూడా లేకపోలేదు. భారతీయ క్రీడ ఏదీ అంటే హాకీ.. అలాంటి జాతీయ క్రీడకు కంపెనీలు ముందుకు రాకపోవటం అతన్ని కలిచివేసింది. దీనికి మించి.. మంచి హాకీ ప్లేయర్‌ నవీన్‌ పట్నాయక్‌. చిన్నతనంలో హాకీ ఆడేవారు. డూన్‌ స్కూల్‌ లో చదివే రోజుల్లో హాకీ జట్టుకు గోల్‌ కీపర్‌ గా ఉన్నారు. ఇప్పటికీ రెగ్యులర్‌ గా హాకీ మ్యాచులు చూస్తూ ఉంటారు సీఎం నవీన్‌ పట్నాయక్‌. క్రికెట్‌ కంటే హాకీనే ఇష్టం అంటారు ఆయన.హాకీపై అతనికి ఉన్న మక్కువతోనే.. ఒడిశా ప్రభుత్వం తరపున భారత హాకీ
జట్లకు స్పాన్సర్‌ గా వ్యవహరిస్తున్నారు.100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. క్రీడాకారులకు కావాల్సిన అన్ని వసతులను కల్పించటానికి అవసరం నిధులు సమకూర్చారు. 2023 సంవత్సరం వరకు భారత పురుషులు, మహిళల హాకీ జట్లకు అవసరం అయిన అన్ని ఖర్చులు భరించటానికి ముందుకు వచ్చారు. అతను ఆ రోజు ఆదుకోకపోయి ఉంటే ఇవాళ భారత జట్టు ఇంతలా ప్రదర్శన ఇచ్చేదా.. ప్రాక్టీస్‌ చేసేదా.. చెప్పండి. నీ దగ్గర టాలెంట్‌ ఉండటమే కాదు.. అందుకు తగిన ప్రోత్సాహం, ఆర్థిక సహకారం లేకపోతే మెడల్‌ ఎలా వస్తుంది..ఇవాళ భారత హాకీ జట్టును ఆకాశానికెత్తుతున్నాయి కార్పొరేట్‌ కంపెనీలు, సెలబ్రిటీలు.. ఆ రోజు ఒక్కరయినా ముందుకు వచ్చారా లేదు కదా.. ఇప్పుడు చూడండి.. ఇండియా రాగానే తన బ్రాండ్ల ప్రమోషన్‌ కోసం.. కోట్లు కుమ్మరిస్తాయి.. అది కూడా ఎంతో దూరంలో లేదు.. జస్ట్‌ నాలుగు ఐదు రోజుల్లోనే.. ఆనాడు ఛీ పొమ్మన్న కార్పొరేట్‌ కంపెనీలు గొప్పా.. ఆపదలో ఆదుకుని 100 కోట్లు ఇచ్చిన ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ గొప్పా అన్నది క్రీడాకారులు తేల్చుకోవాలి.