హింసాత్మకంగా మారిన జార్ఖండ్‌లో మావోయిస్టు బంద్‌

రాంచీ: జార్ఖండలో మావోయిస్టుల బంద్‌ హింసాత్మకంగా మారింది. ఇడిశా, ఉత్తరప్రదేశ్‌ల్లో మావోయిస్టు నేతల అరెస్టుకు నిరసనగా జార్ఖండ్‌, బీహర్‌, పశ్చిమబెంగాల్‌, ఛత్తీస్‌గడ్‌ల్లో మావోయిస్టులు బుధవారం 24 గంటల బంద్‌ తలపెట్టారు. ధన్‌బాద్‌ జిల్లాలోని టాప్‌చాన్చిలో పోలీసులు పెట్రోలింగ్‌ వాహనంపై మావోయిస్టులు దాడి చేశారు. ఘటన లొ ధన్‌బాద్‌ఎస్పీ ఆర్కే ధన్‌ త్రుటిలో తప్పించుకోగా ఒక పోలీసు మరణించారని కోయలాంచర్‌ రేంజ్‌ డీఐజీ లక్ష్మణ్‌ ప్రసాద్‌ సింగ్‌ పేర్కొన్నారు. గాయపడిన 15 మందిని చికిత్స నిమిత్తం వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. హెహెగర్హ రైల్వే స్టేషన్‌ భవనాన్ని ధ్వంసం చేయడంతో పాటు తెటుల్‌ మరి ట్రాక్‌ను కూడా మావోయిస్టులు పేల్చేశారు. దీంతో ధన్‌బాద్‌, లాతేహార్‌ జిల్లాల్లో పలురైళ్ల రాకపోకలకు సుమారు 10 గంటలపాటు అంతరాయం కలిగిందని ఆర్పీఫ్‌డివిజన్‌ కమాండర్‌ శవికుమార్‌ తెలిపారు.