హుస్సేన్‌సాగర్‌ తీరంలో రంగురంగుల సెయిలింగ్‌ బోట్ల సందడి

హైదరాబాద్‌: నగరంలోని హుస్సేన్‌సాగర్‌ తీరంలో రంగురంగుల సెయిలింగ్‌ బోట్ల సందడి మొదలైంది. నాలుగో ఇస్‌ల్యాండ్‌ సెయిలింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా రేపటినుంచి పలువురు జాతీయ స్థాయి రేసర్లు పాల్గొన్నారు. సాగర్‌లో అనుకూల వాతావరణ పిరస్థితుల్ని అంచనా వేయడానికి, సెయిలర్లకు ప్రక్టీస్‌ కోసం ఈ పోటీలను నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 100 మంది క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారు.