హెన్రిస్‌ క్లాసెన్‌ విధ్వంసం

సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2024లో భాగంగా పార్ల్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ ఆటగాడు హెన్రిస్‌ క్లాసెన్‌ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో క్లాసెన్‌ పార్ల్‌ రాయల్స్‌ బౌలర్లను ఊచకోత కోశాడు.సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీని క్లాసెన్‌ నమోదు చేశాడు.

కేవలం 16 బంతుల్లోనే తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

అతడి ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. ఓవరాల్‌గా 51 పరుగులు చేసి క్లాసెన్‌ ఔటయ్యాడు. కాగా అంతకుముందు ఈ రికార్డు జోబర్గ్ సూపర్ కింగ్స్ ఆటగాడు డెవాన్‌ ఫెరీరా పేరిట ఉండేది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌ తొలి ఎడిషన్‌లో ఫెరీరా 18 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్‌తో ఫెరీరా రికార్డును క్లాసెన్‌ బ్రేక్‌ చేశాడు.