హైకోర్టులో జగన్‌కు చుక్కెదురు

హైదరాబాద్‌: తనకు బెయిల్‌ కావాలంటూ పట్టువదలని విక్రమార్కునిలా ప్రయత్నిస్తూనే ఉన్న కడప ఎంపీ  వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టులో మరోసారి ఎదురు దెబ్బతగిలింది. అక్రమాస్తుల కేసులో నిందితునిగా ఉన్న జగన్‌ పెట్టుకున్న రెండవ బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

జగన్‌కు బెయిల్‌ ఇవ్వరాదంటూ సీబీఐ చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది. ప్రస్తుత దశలో జగన్‌ బెయిల్‌     అడగడానికి వీలులేదని తేల్చి చెప్పింది.సీబీఐ దర్యాప్తునకు సుప్రీం కోర్టు కాలపరిమితి విధించలేదని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగం ప్రకారం దేశంలోని ఏ న్యాయస్థానమైనా సుప్రీం కోర్టు తీర్పుకు కట్టుబడి ఉండాల్సిందేనని తీర్పులో పేర్కొంది. దీంతో రెండవ బెయిల్‌ పిటిషన్‌ కూడా కొట్టివేతకు గురైంది. గతంలోనే జగన్‌ పెట్టుకున్న స్టాట్యూటరీ బెయిల్‌ పిటిషన్‌ను కూడా ఇదే కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.