హైకోర్టులో పీసీసీ చీఫ్‌ బొత్సకు ఊరట

హైదరాబాద్‌: హైకోర్టులో పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణకు ఊరట లభించింది. మధ్యం సిండికేట్ల వ్యవహారంలో బొత్సపై విచారణ జరిపించాలని దాఖలైన పటిషన్‌ను విచారించిన కోర్టు కొట్టివేసింది. కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని వ్యాఖ్యానించింది. ఆధారాలు లేకుండా కేసు వేసినందుకు పిటిషనర్‌ గిరియాదవ్‌కు కోర్టు రూ. 50 వేల జరిమానా విధించింది.