హైదరాబాద్‌లో అన్నాకు మద్దతుగా విద్యార్థుల ర్యాలీ

హైదరాబాద్‌: అవినీతిపై పోరాడుతున్న అన్నాహజారేకు మద్దతుగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో విద్యార్థులు ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ పతాకాలు చేతబూని నినాదాలు చేస్తూ వెళ్లి చౌరస్తాలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. మధుర సేవాసంస్థ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది.