హైదరాబాద్‌లో ఘనంగా నాగుల పంచమి

హైదరాబాద్‌ : నాగల పంచమి పర్వదినాన్ని హైదరాబాద్‌లో మంగళవారం ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రావణ పంచమితో పాటు నాగుల గరుడ కూడా కలిపి రావడంతో మహిళలు భక్తి శ్రద్దలతో పూజలు జరుపుతున్నారు. ఈ సందర్బంగా ఉప్పల్‌, రామంతపూర్‌, హబ్సిగూడ, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంతంలో ఉన్న నాగదేవత ఆలయంలో మహిళలు బారులు తీరారు. పాలు, పండ్లు, పసుపు, కుంకుమ నాగదేవతకు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు.