హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సహాయం
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 29(జనం సాక్షి)
వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ డ్రైవర్ గా పని చేసి ఇటీవల అనారోగ్యంతో మరణించిన రమేష్ హోంగార్డు కుటుంబానికి సోమవారం వరంగల్ ట్రాఫిక్ పోలీసు సిబ్బంది తరుపున (1,25,000 ) ఒక్క లక్ష ఇరవై ఐదు వేల ఆర్థిక సహాయాన్ని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్ చేతులమీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాబులాల్ మరియు ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు….