హోం కేర్‌ నర్సింగ్‌లో మహిళలకు 3 నెలల శిక్షణ

విజయనగరం, జూన్‌ 12 : రాజీవ్‌ యువకిరణాల కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంత మహిళలకు హోం కేర్‌ నర్సింగ్‌లో మూడు నెలల పాటు ఉచిత శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్‌ వాణిరావు తెలిపారు. ఈ నెల 14న ఈ శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఈజిఎంఎం డిఆర్‌డిఎ సహకారంతో శ్రీరామ్‌ ఎడ్యుకేషనర్‌ సొసైటీ ఆధ్వర్యాన ఈ శిక్షణ ఉంటుందని, ఆ సమయంలో భోజన, వసతి సదుపాయాలు, శిక్షణానంతరం ఉపాధి కల్పిస్తామని ఆమె తెలిపారు. 8వ తరగతి చదివి 30, 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన మహిళలు అర్హులని ఆమె తెలిపారు.