హౌరా-ఢీల్లీ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ

పాట్నా: హౌరా-ఢీల్లి ఎక్స్‌ప్రెస్‌లోని పలు బోగిల్లో దుండగులు భారీ దోపిడీకకి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున బీహార్‌లోని గయా-సాసారామ్‌ స్టేషన్ల మధ్య రైల్లోకి ప్రవేశించిన దుండగులు ప్రయాణికులను బెదిరించి నగదు, నగలు అపహరించుకుపోయారు. దీంతో మొగల్‌ సరాయ్‌ స్టేషన్‌లో ప్రయాణికులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోపిడీలో మొత్తం 25 మంది పాల్గొన్నాట్టు తెలియజేశారు.  రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.