అంగన్వాడి ఉద్యోగుల సమ్మెను జయప్రదం చేయండి
– సిఐటియూ జిల్లా కమిటీ సభ్యుడు బుడిద గణేష్
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథనిలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్లతో కూడిన కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేష్ మాట్లాడుతూ..
అంగన్వాడి ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్ పరిష్కరించాలని అనేక సంవత్సరాలుగా సిఐటియు ఆధ్వర్యంలో పోరాటాల నిర్వహించడం జరిగింది. సిఐటియు పోరాట ఫలితంగా ఆగస్టు 18 ఐసిడిఎస్ మంత్రి సత్యవతి రాథోడ్ అంగన్వాడీ యూనియన్ నాయకులతో సమావేశమై అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది కానీ స్పష్టమైనటువంటి జీవో ఇవ్వలేదని అని అన్నారు. ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో అంగన్వాడీ టీచర్కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద లక్ష రూపాయలు ఆయాకు 50వేల రూపాయలు ప్రకటించడం అంగన్వాడీలను మోసం చేయడమే అని అన్నారు . అంగన్వాడి న్యాయపరమైన డిమాండ్లు పర్మినెంట్ చేయాలని కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రావిటీ ఇవ్వాలని పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా సిఐటియు పాటు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11 నుండి జరిగే నిరవధిక సమ్మెలో అంగన్వాడి ఉద్యోగులందరూ పాల్గొనే జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ఉద్యోగులు పాల్గొన్నారు.