అంతర్జాతీయ సహకార దినోత్సవ వేడుకలు

రామారెడ్డి జులై 2  జనంసాక్షీ :

అంతర్జాతీయ సహకార దినోత్సవ  వేడుకల సందర్భంగా సొసైటి చైర్మన్  అడ్లూర్ ఎల్లారెడ్డి ప్రాథమిక సహకార సంఘంలో ఏడు రంగుల జెండాను ఆయన ఆవిష్కరించారు.  ఈ సందర్బం గా చైర్మెన్ మర్రి సదాశివ రెడ్డి మాట్లాడుతూ,  నిరు పేద రైతుల  అభ్యున్నతికై స్థాపించిన సహకార వ్యవస్థ స్ఫూర్తిని కొనసాగిస్తూ రైతు శ్రేయస్సు కై కృషి చేస్తామన్నారు. రైతులందరికి సహకార వందనాలు తెలియచేశామన్నారు.అనంతరం స్వీట్లు ఒకరినొకరు తినుపించుకున్నారు .ఈ కార్యక్రమం లో డైరెక్టర్లు భాస్కర్, రామ్ రెడ్డి, లక్ష్మా గౌడ్, నారాయణరెడ్డి, ప్రవీణ్ రెడ్డి, క్రిష్ణారెడ్డి, ఉమామ హేశ్వర్ రావ్, సిఈఓ భైరయ్య,  సోసైటి సిబ్బంది  రైతులు తదితరులు పాల్గొన్నారు.