అందరికంటే ముందే జనంసాక్షి చెప్పింది

5
67

కేజ్రీవాల్‌కే ఢిల్లీ పీఠం అని కథనాలు

జనవరి 19న క్రేజ్‌ తగ్గని కేజ్రీవాల్‌,

ఫిబ్రవరి 5న భారత రాజకీయాల్లో కొత్త శక్తి

అంటూ జనంసాక్షిలో పలుకథనాలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10(జనంసాక్షి)-దిల్లీ ఓటరు నాడి జనంసాక్షి ముందే పసిగట్టింది. హస్తిన ఓటరు సామాన్యుణ్నే అందలం ఎక్కించనున్నారని అందరికంటే ముందే చెప్పింది. జనవరి 19 సంచికలో  క్రేజ్‌ తగ్గని కేజ్రీవాల్‌, ఫిబ్రవరి 5న భారత రాజకీయాల్లో కొత్త శక్తి, ఢిల్లీలో ఆప్‌కు తిరుగులేదు అంటూ మరో ప్రధాన వార్తతోపాటు ఫిబ్రవరి 7న ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ క్రేజ్‌ అంటూ ‘జనంసాక్షి’ కథనాల్ని ప్రచురించింది.