అందుబాటులో ఎరువులు, విత్తనాలు
పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
పెద్దపల్లి,జూలై7( జనంసాక్షి)రైతుల సంక్షేమమే ధ్యే యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. సుల్తానాబాద్ మండలంలోని చిన్నబొంకూరు గ్రామంలో రూర్బన్ నిధులు 36 లక్షల రూపాయలతో నిర్మించిన గోదామును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాలను ఆయా గోదాముల్లో అందుబా టులో ఉంచుతున్నారన్నారు. ఎరువుల కోసం రైతులు మండల కేంద్రానికి, చిన్నకలువలకు రానవసరం
లేకుండా ఆయా గ్రామాల్లో ఉన్న గోదాముల్లోనే విక్ర యిస్తున్నారన్నారు. కేడీసీసీబీ డైరక్టర్ మోహన్‌రావు మాట్లాడుతూ చిన్నకలువల సొసైటీ పరిధిలోని అన్ని గ్రామాల్లో గోదాములను నిర్మించుకున్నామని, ప్రతి వ్యవసాయ సీజన్‌లో రైతుల అవసరమైన వాటిని ఈ గోదాముల వద్ద అందుబాటులో ఉంచుతామన్నారు