అంబరాన్ని అట్టిన బతకమ్మ పండుగ సంబరాలు
యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం జనంసాక్షి సెప్టెంబర్24.తుర్కపల్లి పడాల ముత్యాలు మెమోరియల్ హైస్కూల్లో సంబరాల దృశ్యంతుర్కపల్లి మండల కేంద్రంలోని పడాల ముత్యాలు మెమోరియల్ హై స్కూల్ లో శనివారం సాంస్కృతిక దైనందిన కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర బతుకమ్మ పండుగ సంబరాలను ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల చైర్మన్ పడాల శ్రీనివాస్ పాల్గొని అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జంగిటి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు నరసింహారెడ్డి, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు
ReplyForward
|