అంబరాన్ని తాకిన ‘అస్కార్‌’ సంబురం

3

– ఉత్తమ నటుడు లియోనార్డో డికాప్రియో

– ఉత్తమ నటిగా బ్రీ లార్సన్‌ ఎంపిక

లాస్‌ ఏంజిల్స్‌,ఫిబ్రవరి 29(జనంసాక్షి): ప్రపంచ సినీ ఉత్సవంగా చెప్పుకునే ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవం అమెరికాలోని లో అట్టహాసంగా జరిగింది. పేరుకు అమెరికన్‌ అవార్డుల వేడుకే అయినా ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్‌కున్న క్రేజ్‌ అసాధారణం. విశ్వంలోని ప్రతి సినీ కళాకారుడూ తెలిసో, తెలియకో తన లక్ష్యం ‘ఆస్కార్‌’ అనే అంటాడు. అంతటి గుర్తింపు పొందిన ఆస్కార్‌ 2016 సంవత్సర ప్రకటన అట్టహాసంగా సాగింది.  టైటానిక్‌ ఫేమ్‌ హీరో లియోనార్డో డికాప్రియోకు ఎట్టకేలకు ఆస్కార్‌ దక్కింది. ఈ ఏడాది ఆస్కార్స్‌లో ఉత్తమ నటుడు అవార్డును డికాప్రియో ఎగురేసుకుపోయాడు. మొత్తం ఆరు సార్లు ఆస్కార్‌కు నామినేట్‌ అయిన లియోనార్డో చివరకు ఆ అవార్డును సొంతం చేసుకున్నాడు. ద రెవెనంట్‌ చిత్రంలో నటించిన లియోనార్డోకు ఆస్కార్‌ దక్కడం విశేషం. ఈ ఏడాది ఉత్తమ నటిగా రూమ్‌ చిత్రంలో నటించిన బ్రీ లార్సన్‌ అవార్డును సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం కేటగిరీలో స్పాట్‌లైట్‌ ఆస్కార్‌ను గెలుచుకుంది. 88వ ఆస్కార్‌ ప్రదానోత్సవంలో ఆరు ఆస్కార్లతో మ్యాడ్‌ మ్యాక్స్‌ ఫ్యూరీ రోడ్‌ టాప్‌ విన్నర్‌గా నిలిచింది. ద రెవెనంట్‌కు మూడు, స్పాట్‌లైట్‌కు రెండు ఆస్కార్లు దక్కాయి. హాలీవుడ్‌ స్టార్‌ క్రిస్‌ రాక్‌ ఆస్కార్‌ ప్రదానోత్సవానికి ¬స్ట్‌గా వ్యవహరించాడు. డికాప్రియో ఆస్కార్‌ను అందుకునే సమయంలో డాల్బీ థియేటర్‌ కరతాళధ్వనులతో ¬రెత్తింది. సహజసిద్దమైన ప్రకృతితో ద రెవెనంట్‌కు సంబంధం ఉందని ఆస్కార్‌ అందుకున్న డికాప్రియో అన్నాడు. వాతావరణ మార్పులు వాస్తమైనవని, అది ఇప్పుడు జరుగుతోందని, ఆ సమస్యలను పరిష్కరించేందుకు అందరం కృషి చేయాలని డికాప్రియో పిలుపునిచ్చాడు.  ఏడాది ఆస్కార్‌ ఉత్తమ చిత్రంగా స్పాట్‌లైట్‌ నిలిచింది. జర్నలిజంపై తీసిన ఈ చిత్రం ఆస్కార్స్‌లో హాట్‌ టాఫిక్‌గా నిలిచింది. లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఓ క్రైస్తవ పూజారి ఆగడాలను బయటపెట్టేందుకు ఓ జర్నలిస్టుల బృందం ప్రత్యేక కథనాలు ప్రచురిస్తారు. ఆ కథాంశంతో వచ్చిన స్పాట్‌లైట్‌ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్పాట్‌లైట్‌ మూవీలో మైఖేల్‌ కీటన్‌, లివ్‌ స్కీబ్రర్‌, మార్క్‌ రుఫలో, రాచల్‌ మెక్‌ ఆడామ్స్‌, జాన్‌ స్లాటర్‌, బ్రియాన్‌ జేమ్స్‌ కీలక పాత్రలు పోషించారు. చిత్ర నిర్మాతలు మైఖేల్‌ షుగర్‌, స్టీవ్‌ గొలిన్‌, నికోల్‌ రాక్లిన్‌, బై పాగన్‌ ఉత్తమ చిత్రం అవార్డును అందుకున్నారు.

ఉత్తమ నటి బ్రీ లార్సన్‌

యేటి ఆస్కార్స్‌లో ఉత్తమ నటి కేటగిరీలో బ్రీ లార్సన్‌ అవార్డును గెలుచుకుంది. రూమ్‌ చిత్రంలో నటించిన ఆమెకు ఆస్కార్‌ ఉత్తమ నటి క్యాటగిరీలో అవార్డు దక్కింది. అకాడవిూ అవార్డులకు లార్సన్‌

నామినేట్‌ కావడం ఇదే మొదటిసారి.

ఉత్తమ దర్శకుడు అల్‌జాండ్రో గొంజాలెజ్‌ ఇన్‌రిటో

రెవెనంట్‌ ఫిల్మ్‌ను తీసిన మెక్సికో డైరక్టర్‌ అల్‌జాండ్రో గొంజాలెజ్‌ ఇన్‌రిటో ఈ యేటి ఆస్కార్స్‌లో ఉత్తమ దర్శకుడు కేటగిరీలో విజేతగా నిలిచారు. ఉత్తమ దర్శకుడిగా విభాగంలో ఇన్‌రిటో వరుసగా రెండో సారి ఆస్కార్‌ను గెలుచుకున్నారు. గత ఏడాది బర్డ్‌మ్యాన్‌ చిత్రానికి కూడా ఇన్‌రిటోకు ఉత్తమ డైరక్టర్‌ అవార్డు దక్కింది.

ఉత్తమ సంగీత దర్శకుడు ఎన్నియో మెర్రికోన్‌

హేట్‌ఫుల్‌ యైట్‌ చిత్రానికి సంగీతాన్ని అందించిన ఎన్నియో మెర్రికోన్‌కు బెస్ట్‌ ఒరిజనల్‌ స్కోర్‌ కేటగిరీలో ఈ యేటి ఆస్కార్‌ను అందుకున్నారు. 87 ఏళ్ల మెర్రికోన్‌ గతంలో అయిదుసార్లు ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యారు. ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో స్పెక్టర్‌ చిత్రానికి అవార్డు దక్కింది. రైటింగ్స్‌ ఆన్‌ ద వాల్‌ సాంగ్‌ రాసిన జివ్మిూ నేపాల్‌, సామ్‌ స్మిత్‌లకు ఆస్కార్లు దక్కాయి.

కేట్‌ విన్స్‌లెట్‌కు ఆభరణాలు రూపొందించిన నిరవ్‌ మోదీ

టైటానిక్‌ ఫేమ్‌ కేట్‌ విన్స్‌లెట్‌ ఈ యేటి ఆస్కార్స్‌లో ప్రత్యేకంగా కనిపించింది. ఆ బ్యూటీఫుల్‌ స్టార్‌ వేసుకున్న ఆభరణాలను ఇండియన్‌ డిజైనర్‌ రూపొందించారు. ప్రముఖ జ్వలరీ బ్రాండ్‌ నిరవ్‌ మోదీ తయారు చేసిన చెవిపోగులు, రిస్ట్‌ బ్యాండ్‌ను కేట్‌ ధరించింది. ఆ ఆభరణాలతోనే కేట్‌ రెడ్‌కార్పెట్‌లో పాల్గొంది. ఈ ఏడాది ఆస్కార్స్‌లో భారతీయ సంతతికి ఆసిఫ్‌ కపాడియా అవార్డు గెలుచుకుంది. బెస్ట్‌ డాక్యుమెంటరీ కేటగిరీలో అవిూ చిత్రానికి అవార్డు దక్కింది. ఆ ఫిల్మ్‌ను ఆసిఫ్‌ కపాడియా రూపొందించింది.

ప్రియాంక చోప్రా చేతుల విూదుగా..

ఆస్కార్స్‌ వేదికపై ప్రియాంక తళుక్కుమంది. బాలీవుడ్‌ భామ ఈ యేటి ఆస్కార్‌ వేడుకలో ఉత్తమ ఫిల్మ్‌ ఎడిటింగ్‌ విభాగంలో అవార్డును అందజేసింది. మ్యాడ్‌ మ్యాక్స్‌ ఫ్యూరీ రోడ్‌ చిత్రానికి ఫిల్మ్‌ ఎడిటింగ్‌ విభాగంలో మార్గరేట్‌ సిక్సల్‌ ఆస్కార్‌ను గెలుచుకుంది. ప్రియాంకా చోప్రా ఆ అవార్డును మార్గరేట్‌కు అందజేసింది. జార్జ్‌ మిల్లర్‌ రూపొందించిన మ్యాడ్‌ మ్యాక్స్‌ చిత్రం ఆస్కార్‌లో హవా కొనసాగించింది. పది కేటగిరీల్లో పోటీపడ్డ ఆ ఫిల్మ్‌కు ఆరు ఆస్కార్లు దక్కాయి.

ఉత్తమ సహాయనటుడు మార్క్‌ రైలాన్స్‌

యేటి ఆస్కార్స్‌ ఉత్తమ సహాయ నటుడు విభాగంలొ మార్క్‌ రైలాన్స్‌ విజేతగా నిలిచారు. బ్రిడ్జ్‌ ఆఫ్‌ స్పైస్‌ చిత్రంలో మార్క్‌ రైలాన్స్‌ కీలక పాత్ర పోషించారు. తొలిసారి రైలాన్స్‌ ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యారు. స్టీఫెన్‌ స్పిల్‌బర్గ్‌ ఆ సినిమాకు డైరక్షన్‌ చేశారు.

ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ : ఎక్స్‌ మెషీనా

ఏడాది ఎక్స్‌ మెషీనా సినిమాకు ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ కేటగిరీలో ఆస్కార్స్‌ దక్కింది. ఆ ఫిల్మ్‌కు అలెక్స్‌ గార్లాండ్‌ డైరక్షన్‌ చేశారు. అలిసియా వికాండర్‌ ఆ ఫిల్మ్‌లో ఆండ్రాయిడ్‌ రోబో పాత్రను పోషించింది. మానవుల తరహాలో అలిసియా అద్భుతంగా నటించింది. ఆండ్రూ వైట్‌హాస్ట్‌, పాల్‌ నోరిస్‌, మార్క్‌ ఆర్డింగ్టన్‌, సారా బెన్నెట్‌ ఆ కేటగిరీలో ఆస్కార్లను గెలుచుకున్నారు . ఉత్తమ యానిమేషన్‌ స్టోరీ కేటగిరీలో బియర్‌ స్టోరీ సినిమాకు ఆస్కార్‌ దక్కింది. ఉత్తమ యానిమేషన్‌ ఫిల్మ్‌లో ఇన్‌సైడ్‌ ఔట్‌ చిత్రాన్ని ఆస్కార్‌ వరించింది. మాన్యువల్‌ లుబెజ్కి రికార్డు క్రియేట్‌ చేశారు. ఆస్కార్స్‌లో హ్యాట్రిక్‌ కొట్టారు. ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో ఈసారి కూడా లుబెజ్కి ఆస్కార్‌ను అందుకున్నారు. ద రెవెనంట్‌ సినిమాకు

ఆయన కెమెరామెన్‌గా వ్యవహరించారు. దీంతో లుబెజ్కి ఆస్కార్‌ హిస్టరీలో సరికొత్త చరిత్ర సృష్టించారు. గతంలో వరుసగా గ్రావిటీ, బర్డ్‌మాన్‌ చిత్రాలకు లుబెజ్కి సినిమాటోగ్రఫీ విభాగంలో ఆస్కార్లను గెలుచుకున్నారు.

మ్యాడ్‌ మ్యాక్స్‌ ఫ్యూరీ రోడ్‌కు 6 ఆస్కార్లు

/-యాడ్‌ మ్యాక్స్‌ ఫ్యూరీ రోడ్‌ సినిమా ఆస్కార్స్‌లో హల్‌ చల్‌ చేసింది. కాస్ట్యూమ్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌, మేకప్‌-హెయిర్‌స్టయిల్‌, ఫిల్మ్‌ ఎడిటింగ్‌, సౌండ్‌ ఎడిటింగ్‌, సౌండ్‌ మిక్సింగ్‌ విభాగాల్లో ఆ ఫిల్మ్‌ ఆస్కార్లను గెలుచుకుంది. కాస్ట్యూమ్‌ డిజైన్‌లో జెన్నీ బీవాన్‌కు ఆస్కార్‌ దక్కింది. హాలీవుడ్‌ నటి కేట్‌ బ్లాంచెట్‌ ఆ అవార్డును ప్రదానం చేసింది. జెన్సీ బీవాన్‌కు ఆస్కార్‌ దక్కడం ఇదో రెండోసారి. మ్యాడ్‌ మ్యాక్స్‌ ఫ్యూరీ రోడ్‌ సినిమాకు ప్రొడక్షన్‌ డిజైనర్‌గా ఉన్న కొలిన్‌ గిబ్సన్‌, లీసా థాంప్సన్‌ కూడా ఆస్కార్‌ను గెలుచుకున్నారు. మేకప్‌-హెయిర్‌ స్టయిల్‌ విభాగంలోనూ మ్యాడ్‌ మ్యాక్స్‌ ఫిల్మ్‌కే ఆస్కార్‌ దక్కింది. ఫిల్మ్‌ ఎడిటింగ్‌లోనూ ఫ్యూరీ రోడ్‌కు ఆస్కార్‌ దక్కింది. మార్గరేట్‌ సిక్సల్‌ ఆ కేటగిరీలో ఆస్కార్‌ను అందుకున్నారు. సౌండ్‌ ఎడిటింగ్‌లో మార్క్‌ మాంగిని, డేవిడ్‌ వైట్‌లు ఆస్కార్లను అందుకున్నారు. సౌండ్‌ మిక్సింగ్‌ విభాగంలో క్రిస్‌ జెన్‌కిన్స్‌, గ్రెగ్‌ రుడాల్ఫ్‌, బెన్‌ ఓస్మో ఆస్కార్‌ను గెలుచుకున్నారు.

ఉత్తమ సహాయ నటి – అలిసియా వికాండర్‌

త్తమ సహాయన నటి విభాగంలో ఆస్కార్‌ను అలిసియా వికాండర్‌ గెలుచుకుంది. ద డేనిష్‌ గర్ల్‌ ఫిల్మ్‌లో అద్భుతంగా నటించిన ఆమెకు ఆస్కార్‌ను ప్రదానం చేశారు. ఎడ్డీ రెడ్‌మేన్‌ ఆ ఫిల్మ్‌లో ప్రధాన పాత్ర పోషించాడు. వికాండర్‌ ఓ ఆర్టిస్టు పాత్రను పోషించింది.

ఒరిజినల్‌ స్కీన్ర్‌ ప్లే

/రిదటి ఆస్కార్‌ను స్పాట్‌లైట్‌ గెలుచుకుంది. ఒరిజినల్‌ స్కీన్ర్‌ ప్లే కేటగిరీలో స్పాట్‌లైట్‌ సినిమాను ఆస్కార్‌ వరించింది. స్పాట్‌లైట్‌కు స్కీన్ర్‌ ప్లే అందించిన జోష్‌ సింగర్‌, టామ్‌ మెకార్తిలు ఆస్కార్‌ను అందుకున్నారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ చర్చి పూజారిని బట్టబయలు చేసేందుకు ఓ జర్నలిస్టు బృందం చేసిన సాహసమే ఈ సినిమాలో ప్రధాన కథాంశం. ఉత్తమ అనువాద స్కీప్ట్ర్‌ ద బిగ్‌ షార్ట్‌ సినిమాను వరించింది. స్కీన్ర్‌ రైటర్లు చార్లెస్‌ రాండాల్ఫ్‌, ఆడమ్‌ మెకాలు ఈ అడాప్టెడ్‌ స్కీన్ర్‌ ప్లే కేటగిరీలో ఆస్కార్‌ను గెలుచుకున్నారు. అరవై ఏళ్లు గడిచింది. ఆ జంట ఇప్పటికీ స్పెషలే. జాక్‌-రోజ్‌. ఈ క్యారక్టర్లు తెలియని హాలీవుడ్‌ ప్రేక్షకులు ఉండరు. వాళ్లే లియోనార్డో డికాప్రియో, కేట విన్స్‌లెట్‌. టైటానిక్‌ ఫిల్మ్‌లో నటించిన ఫేమస్‌ జోడి డికాప్రియో-విన్స్‌లెట్‌ ఈ ఏడాది ఆస్కార్‌ వేడుకలో ప్రత్యేకంగా కనిపించారు. ఆ నాటి జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. ఈ సారి కూడా ఇద్దరూ అకాడవిూ అవార్డు రేసులో ఉన్నారు. రెవెనంట్‌ ఫిల్మ్‌ కోసం లియోనార్డో డికాప్రియో ఉత్తమ నటుడి కేటగిరీలో పోటీపడుతున్నారు. స్టీవ్‌ జాబ్స్‌ సినిమాలో జొహన్నా హాఫ్‌మన్‌ పాత్ర పోషించిన కేట్‌ విన్స్‌లెట్‌ ఆస్కార్‌ ఉత్తమ సహాయనటి అవార్డు కోసం పోటీపడుతుంది.

రెడ్‌కార్పెట్‌పై ప్రియాంక మెరుపులు

స్కార్‌ రెడ్‌కార్పెట్‌పై హాలీవుడ్‌ భామలు ధగధగలాడారు. ఫ్యాషన్‌ గౌనులతో కిక్కెక్కించారు. బాలీవుడ్‌ భామ ప్రియాంక చోప్రా ఆస్కార్స్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. క్వాంటికో సీరియల్‌తో అమెరికా ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రియాంక ఈ ఏడాది ఆస్కార్స్‌లో అవార్డును కూడా ప్రజెంట్‌ చేయనుంది. వైట్‌

క్రీమ్‌ గౌన్‌లో వచ్చిన బాలీవుడ్‌ బ్యూటీ రెడ్‌కార్పెట్‌ అతిథులను తన అందాలతో స్టన్‌ చేసింది. లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగుతున్న 88వ అకాడవిూ అవార్డుల ప్రదానోత్సవం కోసం తారలంతా తరలివచ్చారు. ఆస్కార్‌ ఉత్తమ నటి అవార్డు కోసం రేసులో ఉన్న కేట్‌ బ్లెంచట్‌ అర్మానీ ఎంబ్రాయిడరీ గౌన్‌లో హళయలొలికించింది. మత్సకన్య డ్రెస్సులో కేట్‌ రెడ్‌కార్పెట్‌కు హాజరైంది. గోల్డెన్‌ బ్రాస్‌లెట్‌ కూడా ప్రదర్శించింది. కారల్‌ ఫిల్మ్‌లో లెజ్బియన్‌ పాత్ర పోషించిన