అంబలి పంపిణీ కేంద్రం ప్రారంభం
ఆదిలాబాద్,మే22(జనం సాక్షి ): కాగజ్‌నగర్ రూరల్ మండలంలోని రాస్‌పల్లిలో మంగళవారం అంబలి పంపిణీ కార్యక్రమాన్ని పారంభించారు. ఈ గ్రామంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ కార్యక్రమాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ్ముడు కృష్ణరావు లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు మౌల్‌కర్ లక్ష్మణ్, ఎంపీటీసీ సభ్యుడు గజ్జి వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.