దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఎన్నికల ఫలితాల్లో అధికార ఆప్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆప్ కీలక నేతలు వెనుకంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆప్ అగ్ర నేతలు కేజ్రీవాల్, సిసోడియా, సీఎం అతిషి, పలువురు నేతలు వెనుకంజలో ఉన్నారు. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థులు పర్వేష్ వర్మ, రమేష్ బిదూరి, కపిల్ మివ్రా ముందంజలో ఉన్నారు. ఇక, కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు.
మరోవైపు.. ఈవీఎంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ఇద్దరు బీజేపీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు