మైనర్ బాలికపై ముగ్గురు కీచక టీచర్లు సామూహిక అత్యాచారం

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని మంచిమార్గంలో నడిపించాల్సిన గురువులే కీచకులుగా మారారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు ఉపాధ్యాయులు 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థినిపై దారుణానికి ఒడిగట్టారు. కృష్ణగిరి సమీపంలోని పోచంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఈ అరాచకం జరిగింది. మైనర్ బాలికపై ముగ్గురు కీచక టీచర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో విద్యార్థని తల్లి ఉపాధ్యాయులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.తన కుమార్తె గర్భం దాల్చిందని, అబార్షన్‌ చేయించడానికి ఆస్పత్రికి తీసుకెళుతున్నట్లు ఆమె చెప్పడంతో నివ్వెరపోయారు. పాఠశాలలో పని చేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. ప్రధానోపాధ్యాయుడి సూచన మేరకు బాలిక తల్లిదండ్రులు జిల్లా బాలల భద్రతాధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు బాలికను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి పరీక్షలు చేయించారు. అనంతరం బర్గూర్‌ ఆల్‌ ఉమన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బర్గూర్‌ డీఎస్పీ నేతృత్వంలోని మహిళా పోలీసులు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులైన పారూరైకు చెందిన చిన్నసామి(57), మత్తూర్‌కు చెందిన ఆరుముగం(45), మేలపట్టికి చెందిన ప్రకాశ్‌(37)ను మంగళవారం అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.