అంబేద్కర్ చౌక్ లో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, పేదలకు స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని, అర్హులైన వారికి ఆసరా పించన్,
వనపర్తి టౌన్: సెప్టెంబర్20 (జనంసాక్షి) అంబేద్కర్ చౌక్ లో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, పేదలకు స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని, అర్హులైన వారికి ఆసరా పించన్, రేషన్ కార్డులు ఇవ్వాలని ఈరోజు అంబేద్కర్ చౌక్ లో పుట్ట ఆంజనేయులు అధ్యక్షత న సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్ వీరయ్య, రాష్ట్ర నాయకులు నాగయ్య, జాన్ వెస్లీ పాల్గొని ప్రసంగిస్తూ వనపర్తి పట్టణంలో 2007 ,2008 ఎనిమిదిలో చేసిన భూ పోరాట ఫలితంగా 685 మందికి ఇళ్లస్థలాల పట్టాలు ఇచ్చారు. అట్టి స్థలంలో స్థలాలు చూపి ఇండ్ల మంజూరుకు ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదా డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారు. అదే స్థలాల్లో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఈ నిరుపేదలకు కేటాయించాలని కోరారు. లేనిచో కొంత సమయం ఇచ్చి ఆ స్థలాల్లో గుడిసెలు వేసి అక్కడే జీవనం పేదలు కొనసాగిస్తారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గారు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి చాలా కాలం అయింది. వాటికి పేదలను ఇండ్లలోకి పంపాలి .లేనిచో అవి శిధిలావస్థకు చేరుకుంటున్నాయన్నారు. గతంలో ఐదు లక్షలు ఇస్తామన్న ముఖ్యమంత్రి ఇల్లు నిర్మాణానికి నేడు మూడు లక్షలు ఇస్తామనడం సరైనది కాదని పెరిగిన ధరలకు మూడు లక్షలు ఎలాంటి ఇల్లు కట్టుకోవడానికి సరిపోవని స్థలం జూపి ఐదు లక్షలు నిర్మాణానికి మంజూరు చేయాలని కోరారు. అనంతరం అంబేద్కర్ చౌక్ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ప్రదర్శన చేస్తూ తాసిల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు. తాసిల్దారు రాజేందర్ గౌడ్ గారికి డిమాండ్లతో కూడిన విపత్రాన్ని వ్యక్తిగత దరఖాస్తులను అందజేశారు. తాసిల్దార్ గారు మాట్లాడుతూ వీలైనంత తొందరగా డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంక్వయిరీ విచారణ జరిపి వెంటనే వాటిని ఇస్తామని జిల్లా కలెక్టర్ గారు వారి ఆదేశాలు ఉన్నాయని విచారణ కోసం జిల్లా లోని నుంచి అధికారులు అవసరం ఉన్నందున ఆలస్యమైందని వెంటనే విచారణ జరిపి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పీర్లగుట్ట, చిట్యాల రోడ్డు ,పెద్దగూడెం తదితర ప్రాంతాల్లో నిర్మించిన ఇండ్లకు నిరుపేదలకు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక జిల్లా నాయకులు ఎండి .జబ్బార్, పుట్ట ఆంజనేయులు ,మేకల ఆంజనేయులు, ఏం రాజు, గోపాలకృష్ణ, ఏ లక్ష్మి, సాయి లీల,రేణుక, పరమేశ్వర చారి ,ఎన్ రాములు, గట్టయ్య, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు