అంబేద్కర్ భవనాలకు నిధులు ఇవ్వండి.
కలెక్టర్ కు వినతి కరీంనగర్ టౌన్ అక్టోబర్ 31(జనం సాక్షి)
అసంపూర్తిగా వున్న అంబేద్కర్ కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని. 101 యూనిట్ లోపు దళితుల గృహాలకు ఉచిత విద్యుత్తు అమలు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కరీంనగర్ ప్రజావాణిలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు కొంపెల్లి సాగర్ వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కిసాన్ నగర్ లోని అంబేద్కర్ కమ్యూనిటీ భవనం అసంపూర్తి నిర్మాణంతో ఉందని భవనం ను పూర్తిస్థాయిలో నిర్మాణ పనులు చేపట్టేందుకు పది లక్షలు మంజూరు చేయాలని కలెక్టర్ ను కోరారు గత కొన్ని సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉండటం వల్ల భవనం నిరుపయోగంగా ఉందని తెలిపారు. జిల్లాలో 101 యూనిట్లో విద్యుత్ వినియోగిస్తున్న దళితులకు 342 జీవో ప్రకారం ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని కోరారు విద్యుత్ అధికారులు కావాలని ఎక్కువ రీడింగ్ తీస్తున్నారని తెలిపారు. కావున రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ దళితులకు అమలు అయ్యేటట్లు విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో కేవీపీఎస్ నగర కార్యదర్శి గాజుల కనకరాజు. దర్పల్లి నవీన్. మల్లేష్. రాజేంద్ర. అంజన్న. మహేందర్ విజయ్ కుమార్ జిల్లాల చిరంజీవి ఉన్నారు.