అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంగా నామకరణం
డోర్నకల్ జూన్ 23 జనం సాక్షి
అంబేద్కర్ భవన్ స్థలాన్ని మోడల్ మార్కెట్ నిర్మాణానికి పట్టణ ఎస్సీల సహాయ,సహకారాలు మరువలేనివని మండలాధ్యక్షుడు నున్నా రమణ అన్నారు.సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మున్సిపల్ కేంద్రంలో 270 గజాల స్థలంలో నిర్మితమవుతున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని కొందరు స్వార్ధపరులు అడ్డగించినప్పటికీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ చొరవతో తిరిగి పనులు ప్రారంభమైనట్లు తెలిపారు.పుర చైర్మన్ వీరన్న,తెరాస నాయకులు పోకల శేఖర్ తో కలిసి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.అనంతరం రెడ్యానాయక్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.కమ్యూనిటీ హాల్ కు అంబేద్కర్ విజ్ఞాన భవన్ గా నామకరణం చేశారు.కార్యక్రమంలో కౌన్సిలర్లు బసిక అశోక్, కందుల అరుణ,పోటు జనార్ధన్,జర్పుల వీరన్న, మౌనిక జైన్,కో ఆప్షన్ లు రామభద్రం,మియా,ఎస్. కె లాలూమియా,మైనార్టీ అధ్యక్షులు గౌస్,అఖిల్, విలియం జాన్సన్,మాతంగి అనిల్, కొత్తపల్లి నర్సింగ్,శ్రీను,ఏసుబు,బండారి శ్రీను,రమణ,నర్సయ్య,ప్రవీణ్,పు రుషోత్తం తదితరులు పాల్గొన్నారు.