అంబ్రెల్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్భిణీలకు శ్రీమంతము
తొర్రూరు 12 సెప్టెంబర్ (జనంసాక్షి )
మండలంలోని అమర్ సింగ్ తండా గ్రామ పంచాయతీలో పరిధిలో ఉన్న అమర్ సింగ్ తండా,కర్రె బిక్య తండా అంగన్వాడి సెంటర్లలో పోషణ వారోత్సవాల్లో భాగంగా అంబ్రెల్లా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, చైర్మన్ శ్రీనివాస్ నాయక్, ఫౌండేషన్ డైరెక్టర్,అమర్ సింగ్ తండా సర్పంచ్ హపావత్ సురేష్ నాయక్ ల ఆధ్వర్యంలో 10 మంది గర్భిణీ మహిళలకు సోమవారం శ్రీమంతం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సురేష్ మాట్లాడుతూ అంబ్రెల్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. అంగన్వాడి సెంటర్లలో పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం పౌష్టిక ఆహారాన్ని అందిస్తుందన్నారు. గర్భిణీ మహిళలు ఆరోగ్యంగా బిడ్డ ఎదిగేందుకు పౌష్టికాహారాలు ఆకుకూరలు పండ్లు గుడ్లు పాలు తీసుకోవాలని సూచించారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఉపసర్పంచ్ విమల, ఏఎన్ఎం పి.అనిత, అంగన్వాడి టీచర్లు జె. కమలాదేవి, జి.భారతి, బి.విజయ, ఆశా వర్కర్ స్వరూప, పాఠశాల ఉపాధ్యాయులు కీర్తిన,త్రివేణి, బిఓఏ ప్రమీల, స్థానికులు లకావత్ కిషన్, తండవాసులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area