అకాల వర్షంతో నష్టపోయిన వారిని ఆదుకోవాలి..

* అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి * ఏ ఐ కె కె ఎం ఎస్, న్యూడెమోక్రసీ

టేకులపల్లి ,జూన్ 1( జనం సాక్షి ): 2 రోజుల క్రితం కురిసిన అకాల వర్షలతో కొందరి ఇంటి రేకులు, గోడలు కూలిపోయాయి, యాసంగి వడ్లు ,మిర్చి తడిసి  అపార నష్టాన్ని కలిగించాయని ,ఈఅకాల వర్షాలు వల్ల అనేకమంది నష్టాలతో నిర్వాసితులయ్యారు. లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. దీంతో బుధవారం అఖిలభారత రైతుకూలి సంఘం(aikms) న్యూడెమోక్రసీ మండల కమిటీల ఆధ్వర్యంలో బాధితులను పరామర్శించారు.  అనంతరం టేకులపల్లి మండలం వెంకట్య తండా లో ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనకు అఖిల భారత రైతు కూలీ సంఘం మండల నాయకులు ధరావత్ వెంకన్న అధ్యక్షత వహించగా

సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి కామ్రేడ్ కల్తీ వెంకటేశ్వర్లు, అఖిల భారత రైతు కూలీ సంఘం(AIKMS) జిల్లా నాయకులు గుగులోత్ రామచంద్రు మాట్లాడుతూ అకాల వర్షాలతో ఇల్లు కూలి, పైకప్పులు పడిపోయి నస్టపోయిన పేదలని, వారందరికి వారికి తక్షణమే ఆర్దీక సహాయం అందించాలని,  డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని ,నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఆదివాసి గిరిజనులపై ఫారెస్ట్, పోలీస్ అధికారుల నిర్బంధాలను ఆపాలని, భూమిలేని పేదలకు గుర్తించి భూమి ఇవ్వాలని అని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వారు కోరారు. వస్తువుల ధరలు పెరగడంతో ప్రజలు మూడు పూటల కడుపునిండా తినలేని పరిస్థితి అని వారన్నారు. ఈకార్యక్రమంలో న్యూడెమోక్రసీ AIKMS నాయకులు బొడ సొమ్ల, దరవత్ భద్రు ,బోడ సేవ్య, వస్య ,భద్రు , చీమలచుక్కమ్మ , కల్తీవిజయ, పార్వతి,తదితరులు పాల్గొన్నారు.