అక్టోబర్ నాటికి మీసేవ ద్వారా 220 రకాల సేవలు
మంత్రి పొన్నాల
హైదరాబాద్: మీసేవ కేంద్రాల ద్వారా అక్టోబర్ నాటికి 220 రకాల సేవలు అందించనున్నట్లు మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. డిసెంబర్ నాటికి 300 పైచిలుకు పౌర సేవలు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. మీసేవకు సంబంధించి వివిధ శాఖల అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.