అక్టోబర్‌ 2 వరకు అన్ని మున్సిపాలిటీలకు ఓడీఎఫ్‌ సర్టిఫికెట్‌ రావాలి

-సీడిఎంఎ డైరెక్టర్‌ టీ కె శ్రీదేవి

వరంగల్‌ కార్పోరేషన్‌, సెప్టెంబర్‌ 7 (జ‌నంసాక్షి): రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు ఓడిఎఫ్‌పైన ఫైనల్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి తదుపరి ప్రక్రియను పూర్తి చేసుకుని అక్టోబర్‌ 2 వరకు ఓడీఎఫ్‌ సర్టిఫికేషన్‌ను పొందాలని సిడిఎంఎ డైరెక్టర్‌ టీకె శ్రీదేవి ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని సిడిఎంఎ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని మున్సిపల్‌ కవిూషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో పలు అంశౄలపై మాట్టాడారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ టాయ్‌లెట్స్‌ వినియోగంపై కళాజాత ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నరు. బహిరంగంగా ఎక్కడైనా ఎవరైనా మల మూత్ర విసర్జనకు పాల్పడితే జరిమానా విదించాలన్నారు. ఓడీఎఫ్‌ చెత్త నిర్వహణ ఇతరత్రా అంశాలపైన ఏ మున్సిపాలిటీ అయినా సరికొత్త ప్రయెగాలకు శ్రీకారం చుట్టనట్లయితే ఆ వివరాలను పొందు పరుస్తూ నామినేషన్స్‌ను ఈనెల 12లోపు సిడిఎంఎ కార్యాలయానికి పంపిస్తే అక్టోబర్‌ 2న కేంద్రం ఇవ్వనున్న స్వచ్చభారత్‌ అవార్డుకు ఓఎంపిక కోసం పంపిస్తామన్నారు. స్కోచ్‌ అవార్డుకు ఎంపికైనందున గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కవిూషనర్‌ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. 2016-17 సంవత్సరానికి గాను వచ్చిన 14వ ఫైనాన్స్‌ కవిూషన్‌ నిదులను అమృత్‌ వాటర్‌ సప్లై కోసం వినియోగించుకోవచ్చన్నారు. కార్పోరేషన్‌ పరిధిలో ఎల్‌ఈడి బల్బులను అతి తొందరగా అన్ని డివిజన్లలో ఏర్పాటు చేయాల్సిందిగా అమె సూచించారు. ట్రేడ్‌ లైసెన్స్‌ ప్రాపర్టీ ట్యాక్స్‌ వివరాలు నల్లా కనెక్షన్లు వాటర్‌ చార్జెస్‌ బిల్డింగ్‌ పర్మిషన్స్‌ తదితర వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలన్నారు. ఈకార్యక్రమంలో కవిూషనర్‌ శృతి ఓఝా డీసీఇంద్రసేనారెడ్డి, ఇంచార్జి ఎస్‌ఈ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.