అక్బరుద్దీన్‌ నివాసం వద్ద భారీ బందోబస్తు

హైదరాబాద్‌: వివాదస్పద వాఖ్యలతో పలు కేసుల్లో ఇరుకున్న మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పాతబస్తీలో కూడా భారీ భద్ర ఏర్పాటు చేశారు. ఈ తెల్లవారుజామున లండన్‌ నుంచి వచ్చిన అక్బరుద్దీన్‌ సోదరుడు అసుదుద్దీన్‌, పార్టీ ఎమ్మెల్యేలు, న్యావాదులతో సమావేశమయ్యారు. ఒవైసీ ఆసుపత్రి సిబ్బంది అక్బరుద్దీన్‌ నివాసానికి వచ్చి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు.