అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వాకిటి శ్రీహరి
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను, వాల్మీకి సోదరులను మరియు చిత్తనూర్ గ్రామ రైతులను అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వాకిటి శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పటి వరకు హామీని నెరవేర్చకుండా
కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు మాయ మాటలు చెప్పి గద్దనెక్కిన తర్వాత వాల్మీకుల న్యాయమైన కోరికలను విస్మరించడం ప్రభుత్వానికి తగదన్నారు. ఆప్రజాస్వామికంగా ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసుల చేత అరెస్టు చేయించడం, నిర్బంధించడం ప్రభుత్వ అసమర్ధతకు పనితీరుకు నిదర్శనం అని అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజుల నుండి ప్రభుత్వాని ప్రశ్నిస్తారని పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం హేయమైన చర్య. ప్రశ్నించే గొంతుకులను అణిచివేయడం మంచి పద్ధతి కాదు అన్నారు. రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు త్వరలో గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. అరెస్టు చేసిన వాల్మీకి సోదరులను, చిత్తనూరు రైతులను మరియు కాంగ్రెస్ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రవి కుమార్ పాల్గొన్నారు.