అక్రమ అరెస్టులపై ఆగ్రహం..

 

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేసీఆర్ ఫ్లెక్సీ దగ్ధం.

రాజన్న సిరిసిల్ల , ఆగస్టు 29, (జనం సాక్షి). మధ్యమనేరు నిర్వసితుల సమస్యలపై ఆందోళనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడంపై యూత్ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు దద్దం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యతంగా నిర్వాసితుల సమస్యలపై పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం పై మండిపడ్డారు. గతంలో సీఎం కేసీఆర్ మద్య మానేరు నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్వాసితుల పక్షాన మాట్లాడుతున్న నాయకులను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. నిరసన కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు రెడ్డిమల్ల భాను, చిద్దం శ్రీనివాస్ సతీష్ సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.