అక్రమ పి డి యస్ బియ్యం పట్టివేత

కొడకండ్ల, అక్టోబర్22(జనంసాక్షి)
కొడకండ్ల గ్రామంలో ఉదయం బొలెరో వాహనం లో అక్రమంగా తరలిస్తున్న ప్రజా పంపిణీ చేయవలసిన 33 క్వింటాల్లా అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని, వాహనాన్ని, సీజ్ చేసి పోలీసు స్టేషన్ కి తరలించడం జరిగిందని ఎస్ ఐ కొమురెల్లి తెలిపారు.
బొమ్మల రామరం చెందిన ధరవత్ హతికిరణ్, ధరవత్ గణేష్ భువనగిరి కి చెందిన వారు మరియు మరో గుర్తు తెలియని వ్యక్తి మొత్తo ముగ్గురూ వ్యక్తులపై కేస్ నమోదు చేయడం జరిగిందని ఎస్ ఐ తెలిపారు.ఇలా ప్రజలకు ప్రజలకు చెందవలసిన పి డి ఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ ఐ కొమురెల్లి హెచ్చరించారు.