అక్రెడిటేషన్ కార్డుల పంపిణీ
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
2022 -24 సంవత్సరాలకు గాను పత్రిక విలేఖరులకు అందజేసే అక్రిడేషన్ కార్డులను మొదటగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అక్రిడేషన్ కమిటీ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ మాట్లాడుతు జిల్లాలో 503 అక్రీ డేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు రాగా అందులో కమిటీ సభ్యులు పరిశీలించి 395 అక్రిడేషన్ కార్డులను మొదటి విడతగ 2022-24 సంవత్సరానికి మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో అక్రిడెషన్ కమిటీ సభ్యులు, వి.జహంగీర్, గొట్టిపర్తి భాస్కర్, కొల్లోజు శివ కుమార్, కె.నవీన్, జూకంటి అనిల్ , డీమక్ కన్వీనర్జి.ల్లా పౌర సంబంధాల అధికారి ఎండీ . ఖాజా మొయినుద్దీన్ , సిబ్బంది సంజీవరెడ్డి పాల్గొన్నారు.
