* అఖిల భారత రైతు కూలీ సంఘం
ఆగస్టు 3 న ఛలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు పిలుపు నిచ్చారు. గురువారం జరిగిన ఆ సంఘం సమావేశంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజన పోడు భూముల చట్ట సవరణ బిల్లు ప్రవేశపెడితే ఆదివాసీలకు నష్టం జరుగుతుందన్నారు ఇప్పటికే జీఎస్టీ పేరుతో సామాన్యులకు మోయలేని భారాన్ని మోపిందన్నారు.ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు వరి కోటి వెంకటరావు,పందెం శ్రీను తోలెం వెంకటేశ్వర్లు ధారావత్ బాలు భీముడు తదితరులు పాల్గొన్నారు