*అగ్నిపత్ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష*
బాల్కొండ జూన్ 27 (జనం సాక్షి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్ని పత్ పథకానికి నిరసిస్తూ సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు .ఈ కార్యక్రమంలో బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం దేశ భద్రతకే చాలా ప్రమాదం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నిషేధించే వరకు కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి , జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీరటి భాగ్య,మహిళా ప్రధాన కార్యదర్శి ప్రేమలత అగర్వాల్ ,బాల్కొండ మండల అధ్యక్షుడు వెంకట్ గౌడ్ , మైనారిటీ అధ్యక్షుడు జావిద్ , మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.